Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ ఖాతాలో న్యూఫీచర్... మిస్‌లీడింగ్ ట్వీట్లు చేశారో.. ఖాతా బ్లాక్

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:06 IST)
సోషల్ మీడియా ప్రసారమాధ్యమాల్లో ఒకటైన ట్వీట్టర్ ఖాతాలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకునిరానుంది. ఇక‌పై ట్విట్ట‌ర్‌లో యూజ‌ర్లు ఎవ‌రికైనా త‌ప్పుదోవ ప‌ట్టించే లేదా ఎన్నికల త‌ప్పుడు స‌మాచారాన్ని ప్రచారం చేసే విధంగా ఉన్న ట్వీట్లు క‌నిపిస్తే వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 
 
ఇదుకోసం యాప్ లేదా డెస్క్‌టాప్‌లో స‌ద‌రు ట్వీట్ల‌ కింద ఉండే డ్రాప్ డౌన్ మెనూను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో రిపోర్ట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంచుకుని అనంత‌రం వ‌చ్చే విండోలో ఆ ట్వీట్ ఏవిధంగా త‌ప్పుదోవ ప‌ట్టిస్తుందో, అది యూజ‌ర్ల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తుందో కామెంట్ ఎంట‌ర్ చేసి కింద ఉండే స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో అలాంటి త‌ప్పుదోవ ప‌ట్టించే ట్వీట్ల‌పై ట్విట్ట‌ర్‌కు రిపోర్ట్ వెళ్తుంది. 
 
దీనిపై ట్విట్టర్ టీం స్పందించి పరిశీలన చేపడుతుంది. నిజంగానే ఆ ట్వీట్లు త‌ప్పుదోవ ప‌ట్టించేవిగా, త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసే ట్వీట్లుగా ఉంటే వాటిని వెంట‌నే తొల‌గిస్తారు. అలాంటి మిస్‌లీడింగ్ ట్వీట్ల‌ను పెట్టే వారి ఖాతాలను బ్లాక్ చేస్తారు. 
 
కాగా, ఈ కొత్త ఫీచర్ కేవలం భారత్‌లోని ట్విట్టర్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. త్వ‌ర‌లో అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఫీచ‌ర్‌ను యూర‌ప్ దేశాల్లో అందుబాటులోకి తేనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments