Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌లో వైరైటీ రిపోర్టింగ్... పిచ్చి పీక్స్‌కి చేరింది అనేందుకు నిదర్శనం..

పాక్‌లో వైరైటీ రిపోర్టింగ్... పిచ్చి పీక్స్‌కి చేరింది అనేందుకు నిదర్శనం..
, శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (09:22 IST)
ప్రస్తుతం మీడియా ఛానెళ్లు అత్యుత్సాహంతో వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నారు. అందులో ఏ దేశానికి చెందిన వారైనా అతీతులు ఏమీ కారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలాగే న్యూస్ కవరేజీ ఇస్తూ నవ్వులపాలు అయ్యారు. గతేడాది ప్రముఖ నటి మరణించినప్పుడు, ఆమె ఎలా మరణించింది, బాత్‌టబ్‌లో ఎలా శవమై పడి ఉంది అంటూ ఓ మీడియా ఛానెల్ రిపోర్టర్ వార్తను ప్రసారం చేసాడు. జర్నలిజంకి ఉన్న విలువలను తుంగలో తొక్కి నవ్వులపాలయ్యాడు. 
 
గతంలో పాకిస్థాన్‌లో కూడా ఇలాగే ఓ రిపోర్టర్ గాడిదపై ఎక్కి రిపోర్టింగ్ చేస్తూ బొక్క బోర్లాపడి సెన్సేషనల్ సృష్టిస్తే, తాజాగా మరొకరు మరీ లైవ్‌గా ఉంటుందని వరద నీళ్లలో నిలబడి రిపోర్టింగ్ చేసిన వైనం జర్నలిస్ట్ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎవరూ తేలేని, ఏ ఛానెలూ కవర్ చేయని వార్తను తాను తీసుకురావాలంటూ ఓ ప్రొడ్యుసర్ హుకుం జారీ చేయడంతో సదరు జర్నలిస్ట్, తన ప్రాణాలకు తెగించి వరద నీటిలో ఇలా రిపోర్టింగ్ చేశాడంటూ నైలా ఇనయత్ అనే ఒక జర్నలిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
లైవ్‌గా ఆ నీటిలోనే ఛాతీ వరకు నిలబడి అత్యంత సాహసంగా రిపోర్ట్ చేసేసరికి తమ ట్విట్టర్‌లలో నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఇదో పెద్ద కామెడీ ప్రహసనంలా తయారైందని ఒకరంటే.. మరొకరు ఇలాంటి వారికి పులిట్జర్ అవార్డు ఇవ్వాలంటూ జోకులు పేలుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించాడు.. గర్భం చేశాడు.. పెళ్లి మాటెత్తగానే ఛీకొట్టాడు.. కానిస్టేబుల్ నిర్వాహకం