ప్రేమించాడు.. గర్భం చేశాడు.. పెళ్లి మాటెత్తగానే ఛీకొట్టాడు.. కానిస్టేబుల్ నిర్వాహకం

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (09:15 IST)
ఓ యువతిని ప్రేమ పేరుతో గర్భం చేశాడు. పెళ్లి మాటెత్తగానే ఛీకొట్టిన ఓ పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు ఐదో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సాయికిరణ్ అనే యువకుడు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన అనూష అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక సుఖం పొందాడు. ఫలితంగా అనూష గర్భందాల్చింది. దీంతో తనను పెళ్ళి చేసుకోవాలని సాయికిరణ్‌పై ఒత్తిడి చేయడంతో అతను ఛీకొట్టాడు. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదంటూ దుర్భాషలాడాడు. తాను మోసపోయానని గ్రహించిన అనూష పోలీసులను ఆశ్రయించింది. 
 
పెళ్లి చేసుకుంటానని సాయికిరణ్‌ తనను నమ్మించి.. తనను గర్భవతిని చేశాడని, పెళ్లి విషయంలో ముఖం చాటేస్తూ వచ్చిన సాయికిరణ్‌ ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వ్యవహారంలో బాధిత యువతికి అండగా నిలిచిన మహిళా సంఘాలు.. పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సాయికిరణ్‌పై సత్వరమే చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆడ పసికందు శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్కలు.. ఎక్కడ?