కానిస్టేబుల్ కుమార్తెపై కదిలే కారులో గ్యాంగ్ రేప్

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (09:18 IST)
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార ఘటన వివరాలను పరిశీలిస్తే, బబ్లూ, కాశీరాం జేపీ గుప్తా, హరీశ్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ కానిస్టేబులు కుమార్తెను నమ్మించారు. దీంతో వారికి వారికి ఆ యువతి గతంలో రూ.50 వేలు ఇచ్చింది. డబ్బులు తీసుకొని చాలాకాలమైనా.. ఆ ముగ్గురు ఉద్యోగం ఇప్పించకపోవడంతో.. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేసింది. 
 
డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో విభూతిఖండ్‌ వద్దకు రావాలని, డబ్బులు తిరిగి ఇస్తామని బాధితురాలికి చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని.. నడుస్తున్న కారులో ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తాలిబగ్‌ ప్రాంతంలో కారు నుంచి కిందికి తోసేసి అక్కడ నుంచి పారిపోయారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?