Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?

12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
, ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (20:18 IST)
వెయ్యిమందితో కాదు ఏకంగా 12వేల మందితో శారీరక సుఖాన్ని పంచుకున్నాడు.. ఓ 65 ఏళ్ల వ్యక్తి. 12 ఏళ్ల వయసున్న బాలికల దగ్గర్నుంచి 72 ఏల్ల ముసలమ్మల దాకా అందరితోనూ ఆ పని కానిచ్చాడు. దాదాపు 27 ఏళ్ల తర్వాత అతను చేస్తున్న అఘాయిత్యాలు బయటికి రావడంతో ఈ దుర్మార్గుడి గురించి ప్రపంచానికి తెలియవచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. అతనో ఓ స్కూల్ హెడ్మాస్టర్. జపాన్‌లోని టోక్యోకి సమీపంలో ఉండే తకషిమా అనే స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై అత్యాచార కేసు నమోదైంది. స్కూళ్లో చదువుకోవడానికి వచ్చే బాలికల ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకుని, వారిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో పోలీసులతో పాటు సభ్య సమాజం విస్తుపోయే నిజాలెన్నో బయటికి వచ్చాయి. 1988లో స్కూల్‌కు ఉపాధ్యాయుడిగా వచ్చిన తకషీమా... అప్పటి నుంచి అమ్మాయిలతో, యువతులతో, మహిళలతో శారీరక సంబంధం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. తనకు వచ్చే జీతాన్ని మొత్తం యువతులతో అనుభవించేందుకే ఖర్చు పెట్టేవాడు.  
 
27 ఏళ్ల కాలంలో అతని దగ్గర అమ్మాయిల 400 ఆల్బమ్స్‌లు, దాదాపు లక్షన్నర ఫోటోలను పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాటి ఆధారంగా లెక్కేయగా తకషీమా అనుభవించిన మహిళల సంఖ్య 12 వేలకు పైనే అని తేలింది. వీరిలో దాదాపు 10 శాతం మంది అంటే 1200 మంది 12 నుంచి 16 ఏళ్ల లోపు ఉన్న బాలికలు. 
 
తన పాఠాలు బోధించే పాఠశాలలో ఉన్న విద్యార్థుల ఆర్థిక కష్టాలను తెలుసుకుని, వారిని తీర్చేవాడు. ప్రతిఫలంగా తన కోరిక తీర్చమని కోరేవాడు. దాదాపు రెండేళ్ల క్రితం జపాన్ దేశంలో వెలుగుచూసిన ఈ హెడ్మాస్టర్ రాసలీలల ఉదంతం... ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఇతనికి యోకోహామా జిల్లా కోర్టు అతనికి కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశాన్ని ముక్కలు కానివ్వను : నరేంద్ర మోడీ