Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ట్రూ కాల‌ర్‌'లో నంబర్ స్కానింగ్ ఫీచర్.. ఎలా?

అప‌రిచిత నంబ‌ర్ల వివ‌రాల‌ను వెల్లడించే 'ట్రూ కాల‌ర్' యాప్ గురించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. అంతలా ప్రాచూర్యం పొందిన ఈ యాప్ భార‌త వినియోగ‌దారుల కోసం ప్ర‌త్యేకంగా మ‌ర

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (12:24 IST)
అప‌రిచిత నంబ‌ర్ల వివ‌రాల‌ను వెల్లడించే 'ట్రూ కాల‌ర్' యాప్ గురించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. అంతలా ప్రాచూర్యం పొందిన ఈ యాప్ భార‌త వినియోగ‌దారుల కోసం ప్ర‌త్యేకంగా మ‌రో రెండు కొత్త సదుపాయాల‌ను తీసుకువ‌చ్చింది. 
 
ఆండ్రాయిడ్‌లో వెర్ష‌న్ 8.45 అప్‌డేట్‌లో భాగంగా నంబ‌ర్ స్కాన‌ర్‌, ఫాస్ట్‌ట్రాక్ నంబ‌ర్స్ ఫీచ‌ర్ల‌ను 'ట్రూ కాల‌ర్' ప‌రిచ‌యం చేసింది. నంబ‌ర్ స్కాన‌ర్ ద్వారా విజిటింగ్ కార్డులు, షాపింగ్ బ్యాగులు, అడ్వర్టైజింగ్ బోర్డుల మీద ఫోన్ నంబ‌ర్ల‌ను డైరెక్ట్‌గా స్కాన్ చేసి, ఫో‌న్‌లో సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది. 
 
స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా సెల్ నంబ‌ర్‌ను స్కాన్ చేసి, ఫోన్‌బుక్‌లో ఎంట‌ర్ చేసుకోవ‌చ్చు. దీంతో మాన్యువ‌ల్‌గా నంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అలాగే ఫాస్ట్‌ట్రాక్ నంబ‌ర్స్ సౌక‌ర్యం ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్‌, ఎమ‌ర్జెన్సీ నంబ‌ర్స్‌తో పాటు ఇత‌ర ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌కు సంబంధించిన నెంబ‌ర్ల‌ను 'ట్రూ కాల‌ర్' అందుబాటులో ఉంచనుంది. ఈ స‌దుపాయాన్ని ఇంట‌ర్నెట్ లేన‌పుడు కూడా ఉప‌యోగించుకునే అవకాశం కల్పించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments