Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లెనోవో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కె8 ప్లస్.. అదిరిపోయే ఫీచర్లు...

ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన లెనోవో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కే8 ప్లస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను నిక్షిప్తంచేసింది

లెనోవో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కె8 ప్లస్.. అదిరిపోయే ఫీచర్లు...
, గురువారం, 7 సెప్టెంబరు 2017 (09:51 IST)
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన లెనోవో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కే8 ప్లస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను నిక్షిప్తంచేసింది. 
 
ఈ ఫోన్ ఫైన్ గోల్డ్, వీనమ్ బ్లాక్ రంగుల్లో లభ్యంకానుంది. ప్రస్తుతం దీంట్లో ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఓఎస్‌ను అందిస్తున్నారు. త్వరలో దీనికి ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను అందివ్వనున్నారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. దీని వల్ల రెండు సిమ్‌లతోపాటు మెమొరీ కార్డును కూడా వేసుకోవచ్చు.
 
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ25 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ10,999గా నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇర్మా బీభత్సం.. బర్ముడా దీవిలో భవనాలు నేలమట్టం...