Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్సప్ సైకో అరెస్ట్: 300 మంది మహిళలతో రొమాంటిక్ టాక్.. వాట్సాప్ గ్రూపులో..?

వాట్సప్ సైకోను పోలీసులు పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో వివాహితులు, యువతులు, విద్యార్థినులతో పరిచయాలు పెంచుకుని వందల సంఖ్యలో వారి ఫోన్ నెంబర్లను సేకరించాడు. స్నేహం పేరుతో మాటలు కలిపి వారితో రొమాంటిక్ థాట్స

వాట్సప్ సైకో అరెస్ట్: 300 మంది మహిళలతో రొమాంటిక్ టాక్.. వాట్సాప్ గ్రూపులో..?
, శనివారం, 11 మార్చి 2017 (10:31 IST)
వాట్సప్ సైకోను పోలీసులు పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో వివాహితులు, యువతులు, విద్యార్థినులతో పరిచయాలు పెంచుకుని వందల సంఖ్యలో వారి ఫోన్ నెంబర్లను సేకరించాడు. స్నేహం పేరుతో మాటలు కలిపి వారితో రొమాంటిక్ థాట్స్ షేరింగ్ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ తయారు చేశాడు. అందులో అశ్లీల ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్‌లు షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. ఆరునెలలుగా సాగుతున్న అతని ఆగడాలు.. ఓ బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకొచ్చాయి. ఈ మేరకు సైబర్ పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నందమూరు గ్రామానికి చెందిన ఉప్పులూరి మణిరత్నం (23) డిగ్రీ పూర్తి చేశాడు. పనీపాటాలేకుండా తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్నాడు. ఏడు నెలల క్రితం ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌ తదితర సోషల్‌ మీడియాల్లో యువతులు, గృహిణులకు ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ పంపేవాడు. అటునుంచి ఓకే రాగానే చాటింగ్‌ ప్రారంభించేవాడు. వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్లు సంపాదించేవాడు. ట్రూ కాలర్ సహకారంతోనూ మహిళల నెంబర్లను సేకరించేవాడు. 
 
ఆరు నెలల కాలంలో 300 మంది మహిళల నెంబర్లు సేకరించి.. వారితో రొమాంటిక్ టాక్ మొదలెట్టాడు. పగలు, రాత్రి తేడా లేకుండా ఆ గ్రూపులో అసభ్యకర మెసేజ్‌లు, అశ్లీల దృశ్యాలను పోస్ట్‌ చేసేవాడు. శృంగారపరమైన అంశాలతో చాటింగ్‌ జరిపేవాడు. వారి వ్యక్తిగత విషయాలను గ్రూపులో పంచుకోవాలంటూ ఒత్తిడి తెచ్చేవాడనీ సమాచారం. మూడు నెలలుగా అతడి నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తుండటంతో నగరానికి ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులకు రంగంలోకి దిగి మణిరత్నంను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#UPElectionResults : ఉత్తరప్రదేశ్ కోటపై కాషాయ జెండా.. రామాలయం నిర్మాణం తథ్యమా?