Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#UPElectionResults : ఉత్తరప్రదేశ్ కోటపై కాషాయ జెండా.. రామాలయం నిర్మాణం తథ్యమా?

ఉత్తరప్రదేశ్‌ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఇందులో ఆ పార్టీకి విస్పష్టమైన మెజార్టీని ఆ రాష్ట్ర ఓటర్లు

#UPElectionResults : ఉత్తరప్రదేశ్ కోటపై కాషాయ జెండా.. రామాలయం నిర్మాణం తథ్యమా?
, శనివారం, 11 మార్చి 2017 (10:11 IST)
ఉత్తరప్రదేశ్‌ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఇందులో ఆ పార్టీకి విస్పష్టమైన మెజార్టీని ఆ రాష్ట్ర ఓటర్లు ఇచ్చారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో ప్రాథమిక ట్రెండ్ మేరకు బీజేపీ 282 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 202 సీట్లు కావాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే యూపీ కోటను బీజేపీ హస్తగతం చేసుకున్నట్టే. అలాగే, ఎస్పీ - కాంగ్రెస్ కూటమికి 82, బీఎస్పీకి 28, ఇతరులు 10 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
దీంతో బీజేపీ శ్రేణులకు ముందుగానే హోలీ వచ్చినట్టయింది. ఆ పార్టీ నేతలు యూపీలో ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. శనివారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రెండో స్థానం కోసం ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ పోటీ పడుతున్నాయి. మిగతా పార్టీలన్నిటినీ కలుపుకున్నప్పటికీ బీజేపీ కన్నా వెనుకబడి కనిపిస్తున్నాయి. 
 
'యూపీ కే లడకే' అని రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌లను ప్రచారం చేసినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. దత్త పుత్రుడని, వృద్ధుడని నరేంద్ర మోడీని విమర్శించినప్పటికీ ఓటర్లు పట్టించుకోలేదు. ఇకపోతే.. బీఎస్పీ ఏనుగు రన్ ఔట్ అయిందని విశ్లేషకులు హస్యోక్తులు పంచుతున్నారు. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తీర్పు చెప్పాలని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం పెద్దగా ప్రభావం చూపలేదు. పైగా మోడీ ప్రభంజనం బాగా ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. మోడీ-షా జోడీని ప్రజలు ఆదరిస్తున్నారని బీజేపీ చెప్తోంది. లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని రీటా బహుగుణ జోషీ గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్టయితే అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవాలో కమలం పార్టీకి చుక్కలు.. యూపీలో సొంత ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ?