Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్‌ఎక్స్‌ ప్రీమియం ప్లాన్లను బ్లాక్ చేసిన ట్రాయ్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (15:01 IST)
భారతీ ఎయిర్‌టెల్‌ ప్లాటినం, వొడాఫోన్‌ ఐడియా రెడ్‌ఎక్స్‌ ప్రీమియం ప్లాన్లను టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) బ్లాక్ చేసింది. ఈ రెండు ప్రణాళికలు నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంగిస్తున్నాయని పేర్కొంది. 
 
నిబంధలు ఉల్లంఘించకుండా ఇలాంటి ప్లాన్‌లను ఎలా అమలు చేయాలో ఏడు రోజుల్లో వివరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ను కోరింది. వొడాఫోన్ ఐడియా రెడ్ ఎక్స్ ప్లాన్ 2019 నవంబర్ నుంచి మార్కెట్లో అమలులో ఉంది. 
 
మే, 2020లో కొన్ని మార్పులు చేశారు. ఎయిర్‌‌టెల్ త్వరలోఇదే విధమైన ప్లాన్‌ను ప్రారంభించబోతున్నది. ఈ ప్లాన్లలో ప్రీమియం కస్టమర్లకు అధిక వేగం, ప్రాధాన్యత సేవలు ఇస్తుండటం నెట్‌ న్యూట్రాలిటీకి విరుద్ధం. 
 
దీనిపై ఎయిర్‌ టెల్‌ ప్రతినిధి మాట్లాడుతూ 'మా ఖాతాదారులందరికీ అత్యుత్తమ నెట్‌వర్క్‌, సర్వీసు అనుభవాన్ని అందించడానికి మక్కువతో ఉన్నాం. అందుకే లోపాలను తొలగించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. అదేసమయంలో, మా పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం సేవలు, ప్రతిస్పందన విషయంలో బార్‌ను పెంచాలని కోరుకుంటున్నామని, ఇది మా చివర్లో కొనసాగుతున్న ప్రయత్నం' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments