Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో నడిచే ప్రైవేటు రైలు మార్గాలేంటి?

తెలుగు రాష్ట్రాల్లో నడిచే ప్రైవేటు రైలు మార్గాలేంటి?
, శుక్రవారం, 10 జులై 2020 (12:51 IST)
దేశంలో ప్రైవేటు రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా వందకు పైగా మార్గాల్లో ప్రైవేటు రైళ్లు నడిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఫలితంగా 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లు నడువనున్నాయి. ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని 10 రూట్లు కూడా ఉన్నాయి.
 
ఈ రూట్లలో విమానాల తరహాలో రైళ్లను నిర్వహించేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్న కేంద్రం, ఆసక్తిగల సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్లను కూడా ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పరుగులు పెట్టించాలని భావిస్తోంది.
 
ఇక సికింద్రాబాద్ క్లస్టర్‌లో నడిచే ప్రైవేటు రైళ్ల వివరాలు పరిశీలిస్తే, సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి, ముంబై, హౌరా మార్గాలు, విశాఖ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాలున్నాయి. వీటితో పాటు ముంబై - ఔరంగాబాద్ మార్గం కూడా సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలోనే ఉండనుంది.
 
కాగా, ప్రైవేటు రైళ్లను అనుమతించడాన్ని కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేట్ రైళ్లు వస్తే, లక్షలాది మంది రైల్వే ఉద్యోగులు, కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆరోపిస్తోంది. 
 
ప్రపంచంలోనే అతిపెద్ నెట్‌వర్క్‌ను కలిగిన భారతీయ రైల్వేను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని, దీన్ని అడ్డుకుంటామని ఆ యూనియన్ నేతలు ప్రకటించారు. 
 
ప్రస్తుతం పేదల ప్రయాణ సాధనంగా ఉన్న రైల్వేలను ప్రైవేటీకరిస్తే, లాభాల అర్జనే ధ్యేయంగా చార్జీల మోత మోగుతుందని, ఫలితంగా ప్రయాణికులపై మోయలేని భారం పడుతుందని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు కరోనా అని తెలియడంతో బస్సులో దూకి భార్య పరుగో పరుగు.. ఎక్కడ?