Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుశాంత్ సింగ్ చివరి సినిమా ట్రైలర్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్ (Video)

Advertiesment
Dil Bechara trailer
, సోమవారం, 6 జులై 2020 (18:00 IST)
sushanth singh
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ చివరి సినిమా ట్రైలర్ చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య యావత్తు సినీ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ చివరిగా నటించిన 'దిల్‌ బేచారా' ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి కనిపించనున్నారు. సంజనా కూడా ట్రైలర్ రీలీజ్ కు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సన్నివేశాలను పోస్టు చేశారు.
 
ఇక ట్రైలర్ చూస్తుంటే సుశాంత్ జీవితమే సినిమాగా తీశారా అన్నట్లుగా తోస్తుంది. సుశాంత్ ట్రైలర్‌లో చూస్తుంటే మనసులో తెలియని బాధ వెంటాడుతుంది. ఇంత మంచి నటుడు ఇలా దూరమయ్యాడేనని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇందులో సుశాంత్ పలికే ప్రతీ డైలాగ్ కూడా మనసులను తాకుతుంది. 
 
''ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం నిర్ణయించలేదం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉంటుంది'' అంటూ ట్రైలర్‌లో సుశాంత్ పలికిన సంభాషణలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఈ చిత్రం జూలై 24న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు లేకుండా ఫ్రీగా అందరికి అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్.. పవన్ అంటే ఇష్టం.. డ్యాన్స్‌లో ఆ ఇద్దరూ ఇద్దరే..!