Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌టాక్‌పై ఆస్ట్రేలియా ఏమంటోంది..? చైనా ముద్రను వద్దనుకుంటుందా?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (20:46 IST)
చైనా యాప్ టిక్‌టాక్‌పై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ తన మాతృ కంపెనీ బైట్ డ్యాన్స్ నుంచి విడిపోయి లండన్ లేదా అమెరికాలలో తన హెడ్ క్వార్టర్స్‌ను నెలకొల్పే యత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టిక్‌టాక్‌పై ఉన్న చైనా యాప్ ముద్రను తొలగింపజేయవచ్చని టిక్‌టాక్ భావిస్తోంది. 
 
అయితే ఈ విషయంలో టిక్‌టాక్ ఏ మేర సక్సెస్ అవుతుందో లేదో కానీ.. భారత్ తరహాలో అమెరికా, బ్రిటన్‌లు కూడా టిక్‌టాక్‌లో తమ యూజర్ల డేటా స్టోరేజ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా తాజాగా టిక్‌టాక్‌పై చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. టిక్‌టాక్‌లో స్టోర్ అయి ఉన్న తమ పౌరుల డేటా, వారి ప్రైవసీ, డేటా స్టోరేజ్ భద్రత తదితర అంశాలను పరిశీలిస్తోంది. దీంతో టిక్‌టాక్‌కు ఇంకా భయం పట్టుకుంది. టిక్‌టాక్ నిజానికి గత కొద్ది వారాల కిందటే ఆస్ట్రేలియాలో తన కార్యాలయాలను ప్రారంభించింది. 
 
ఇక ఆస్ట్రేలియాకు చెందిన టిక్‌టాక్ యూజర్ల డేటా సింగపూర్‌, అమెరికాల్లో ఉందని.. టిక్‌టాక్ ఆస్ట్రేలియా ప్రతినిధులు చెప్తున్నారు. వారి డేటా అత్యంత భద్రంగా ఉందని హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ టిక్‌టాక్‌పై ఆస్ట్రేలియా సూక్ష్మ పరిశీలన చేస్తోంది. ఏవైనా తేడాలు వస్తే వేటు వేసేందుకు ఆస్ట్రేలియా కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments