Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్‌టాక్ వ్యవహారంలో అమేజాన్ వెనక్కి తగ్గిందా? కారణం?

Advertiesment
Amazon
టిక్‌టాక్ వ్యవహారంలో అమేజాన్ కాస్త వెనక్కి తగ్గింది. టిక్‌టాక్ యాప్‌ను త‌మ ఫోన్ల నుంచి తీసేయాల‌ని కోరుతూ ఉద్యోగుల‌కు మెయిల్ పంపిన అమేజాన్ సంస్థ కొన్ని గంటల్లోనే వెనక్కి తగ్గుతూ ప్రకటన చేసింది. పొర‌పాటుగా ఈ-మెయిల్ పంపామ‌ని, టిక్‌టాక్ నిషేధంపై ప్ర‌స్తుతం త‌మ‌కు ఎలాంటి విధానాలు లేవ‌ని పేర్కొంది. 
 
టిక్‌టాక్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు సంబంధించి ఏం జ‌రిగిందనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి అమెజాన్ డాట్‌కామ్‌ ప్ర‌తినిధి జాకీ అండ‌ర్స‌న్ నిరాక‌రించారు. టిక్‌టాక్ యాప్‌ను తీసేయాల‌ని ఉద్యోగుల‌కు మొయిల్ పంపగా ఆ విష‌యం కాస్తా టిక్‌టాక్ ప్ర‌తినిధి వ‌ర‌కు చేరింది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన ఆయ‌న అమెజాన్ ప్ర‌తినిధి జాకీ అండ‌ర్స‌న్‌తో ప‌రస్పరం చ‌ర్చ‌లు జ‌రిపారు. 
 
దీంతో టిక్‌టాక్ నిషేధంపై అమెజాన్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.  భార‌త్-చైనా స‌రిహ‌ద్దు వివాదం నేపథ్యంలో టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌ల‌ను భారత ప్రభుత్వం బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎస్ఎఫ్‌లో మరో 73 మందికి కరోనా