భారత్ టిక్‌టాక్ సహా 59 చైనాకు చెందిన యాప్‌లను బ్యాన్ చేసింది. ఇదే బాటలో ఇతర దేశాలు కూడా టిక్‌టాక్‌పై బ్యాన్‌పై దృష్టి సారించాయి. అయితే అగ్రరాజ్యం వేరొక కొత్త ఐడియా వేసింది. చైనాకు చెందిన 'టిక్‌టాక్'ను అమెరికా సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై వైట్ హౌస్ ఆర్థిక సలహాదారుడు ల్యారీ కుడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టిక్‌టాక్ తన మాతృ సంస్థ బైట్‌డాన్స్ నుంచి విడిపోయి అమెరికా సంస్థగా సేవలు కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన సంస్థలు సొంతం చేసుకోవాలని చూస్తున్నాయా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. కాగా, టిక్‌టాక్‌పై భారత్ బ్యాన్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో.. తన హెడ్ ఆఫీసునే టిక్‌టాక్ మరోదేశానికి మార్చాలని భావిస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి.
కాగా.. ప్రపంచ దేశాలను అట్టుడికింపచేస్తున్న కరోనాను వూహాన్ దాటకుండా కట్టడి చేసిన చైనా... తమ దేశం నుంచి ప్రపంచానికి వ్యాప్తి చెందకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ వస్తోన్న విమర్శల నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన యాప్‌లు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే టిక్‌టాక్ సహా 59 యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో టిక్‌టాక్'ను అమెరికా హస్తగతం చేసుకోనుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.