శాంసంగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గెలాక్సీ ఏ80పై రూ.30వేల తగ్గింపు

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:57 IST)
Samsung Galaxy A80
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. శాంసంగ్ తన గెలాక్సీ ఏ80 స్మార్ట్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న లిస్టింగ్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.52,000. అయితే ఈ ఫోన్‌పై రూ.30,001లను తగ్గించారు. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు రూ.21,999కే అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డే జరుగుతోంది. ఈ భారీ తగ్గింపు ఇందులో భాగమా అనేది ఇంకా తేలలేదు.
 
ఈ ఫోన్ కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 8 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఏంజెల్ గోల్డ్, ఘోస్ట్ వైట్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. వైఫై, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీలను ఇది సపోర్ట్ చేస్తుంది. 
 
గెలాక్సీ ఏ80 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల సంగతికి వస్తే..?
 
6.7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే,
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్,
8 జీబీ ర్యామ్, బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలో ఆటోఫోకస్ ఫీచర్‌
 
ఇందులో 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
ఇంకా రెండు నానోసిమ్‌లను అమర్చే సిమ్ ట్రేను కలిగివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments