Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లిఫ్ కార్ట్‌లో సరికొత్త ఫీచర్.. వాయిస్ అసిస్టెంట్ వచ్చేస్తోంది..

ఫ్లిఫ్ కార్ట్‌లో సరికొత్త ఫీచర్.. వాయిస్ అసిస్టెంట్ వచ్చేస్తోంది..
, మంగళవారం, 9 జూన్ 2020 (17:21 IST)
Flipkart
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్‌లో సరికొత్త ఫీచర్ రానుంది. తన వినియోగదారుల సేవలను మరింత సులభతరంగా చేసేందుకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. 
 
ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ స్టోర్‌లో, సూపర్‌ మార్ట్‌లో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ అండ్రాయిడ్‌ ఆధారిత యాప్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. ఐఓఎస్‌ ఆధారిత యాప్‌లో, వెబ్‌లో భవిష్యత్తులో ఇది అందుబాటులోకి రానుంది.
 
హిందీ, ఇంగ్లీష్‌లో ఇచ్చే వాయిస్‌ కమాండ్స్‌ను ఇది అర్థం చేసుకోగలదు. తద్వారా షాపింగ్‌ చేయడంలో ఇది కస్టమర్లకు ఉపయోగపడుతుంది. ఫ్లిప్‌కార్ట్ గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ సాతి పేరుతో స్మార్ట్ అసిస్టివ్‌ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఫ్లిఫ్ కార్ట్ అంతర్గత సాంకేతిక బృందం స్పీచ్ రికగ్నిషన్, నేచురల్ లాంగ్వేజ్ అవగాహన, మెషిన్ ట్రాన్స్‌లేషన్, టెక్స్ట్ టు స్పీచ్ లాంటివి ఉపయోగించి ఈ వాయిస్ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేశారని సదరు సంస్థ తెలిపింది. 
 
ఇది వినియోగదారులు మాట్లాడే భాషను స్వయంగా గుర్తించగలదని, షాపింగ్‌కు సంబంధించిన సంభాషణను అర్థం చేసుకొని వినియోగదారులకు సహకారం అందిస్తుందని కూడా తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ వాయిస్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లీష్, హిందీలోని ఆదేశాలను మాత్రమే కాకుండా ఈ రెండింటి మిశ్రమ భాషా ఆదేశాలకు కూడా ప్రతి స్పందించగలదు. ఈ అనుభవం షాపింగ్‌చేసినప్పుడు దుకాణదారుడితో మాట్లాడినట్లుగానే అనిపిస్తోంది అని ఫ్లిప్‌కార్టు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణను అనుసరించిన తమిళనాడు, పుదుచ్చేరి.. టెన్త్ పరీక్షలు రద్దు