లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఈ-కామర్స్ సంస్థలు అమ్మకాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో యాపిల్ నుంచి కొత్త ఫోన్ ఫ్లిఫ్ కార్ట్‌లో అమ్మకానికి రానుంది. ఇది భారత్‌లో యాపిల్ అభిమానులకు శుభవార్తగా మిగిలిపోనుంది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ 2020 అమ్మకాలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఫోన్ మూడు వేరియంట్లలో లభించనుంది. న్యూ మోడల్ బ్లాక్, వైట్, రెడ్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి భారీ రాయితీలు లభించనున్నాయి. ఐఫోన్ ఎస్‌ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ప్లాట్ రూ.3,600 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత బేస్ వేరియంట్ ఫోన్ కోసం రూ.38,900 చెల్లిస్తే సరిపోతుంది.
యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ ధరలు
భారత్‌లో 64 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.42,500
128జీబీ వేరియంట్ ధర రూ.47,800
256జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ.58,300గా కంపెనీ నిర్ణయించింది.
Apple iPhone SE (2020) ఫీచర్స్:
4.7-ఇంచ్‌ల రెటీనా హెచ్డీ (750x1,334 పిక్సెల్స్)
ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (డాల్బీ విజన్),
హెచ్డీఆర్10, ట్రూ టోన్, హాప్టిక్ టచ్ సపోర్ట్,
అలాగే ఏ13 బయోనిక్ చిప్‌తో 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్‌లలో లభించనుంది.
12 మెగాపిక్సల్ కెమెరా, 4కె 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ కెపాజిటీ
7-మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.. సెల్ఫీల కోసం
30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పొందే 18డబ్ల్యూ ఛార్జర్,
4జీ వోల్ట్, వై-ఫై 802, 11ఎఎక్స్, వై-ఫై కాలింగ్, బ్లూటూత్ 5లను కలిగివుంటుంది.