Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సరికొత్త ఫీచర్.. నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయొచ్చు..

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (19:15 IST)
రిలయెన్స్ జియో తమ యూజర్లకు సరికొత్త సేవల్ని అందిస్తోంది. వీవోవైఫై ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. మొబైల్ యూజర్లు స్లో నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కోవడం మామూలే. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల కాల్ డిస్కనెక్ట్ అవుతుంటుంది. అందుకే మొబైల్ కంపెనీలు సరికొత్త సేవల్ని తమ కస్టమర్లకు అందిస్తున్నాయి.
 
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయెన్స్ జియో ఇప్పుడు వీవోవైఫై ఫీచర్‌ను తమ కస్టమర్లకు అందిస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్ కూడా ఇవే సేవల్ని కస్టమర్లకు అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం రిలయెన్స్ జియో ఈ ఫీచర్‌ను మహారాష్ట్రలో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌లో సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయొచ్చు.
 
వైఫై లేదా హాట్‌స్పాట్‌కు కనెక్ట్ అయి ఉంటే చాలు... ఫోన్‌లో నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయడం వీవో వైఫై ఫీచర్ ద్వారా సాధ్యమని రిలయన్స్ తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వీవోవైఫై ఫీచర్‌ని బడా టెలికాం కంపెనీలు పరీక్షిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments