దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ఈ నెల ఆరో తేదీ నుంచి మొబైల్ ఫోన్ల టారిఫ్‌ను పెంచుతున్నట్టు ఇదివరకే రిలయన్స్ జియో ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లతో పోలిస్తే 39 శాతం ధరలను పెంచిన జియో, ఈ ధరలు టెలికామ్ రంగంలోని ఇతర ప్రధాన సంస్థలు వసూలు చేస్తున్న ధరలతో పోలిస్తే తక్కువేనని పేర్కొంది. గతంలో ఉన్న ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో పోలిస్తే, 300 శాతం అదనపు లాభాలను వినియోగదారులు పొందవచ్చని తెలిపింది.
రోజుకు 1.5 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్యాక్ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా, అది రూ. 555కు పెరిగింది. ఇప్పటివరకూ రూ. 153గా ఉన్న ప్లాన్ ధర, రూ.199 అయింది. ఇకపోతే తాము అందించే రూ. 199 ప్లాన్‌ను ఇతర టెల్కోలు రూ. 249 అందిస్తున్నాయని జియో ఓ ప్రకటనలో తెలిపింది.