Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గూగుల్ పే'ని వినియోగిస్తున్నారా..? ఆ లింకుతో జాగ్రత్త.. క్లిక్ చేశారో?

Advertiesment
'గూగుల్ పే'ని వినియోగిస్తున్నారా..? ఆ లింకుతో జాగ్రత్త.. క్లిక్ చేశారో?
, గురువారం, 5 డిశెంబరు 2019 (14:07 IST)
గూగుల్ పేను వినియోగిస్తున్నారా.. అయితే ఆ లింకుతో జాగ్రత్త అంటున్నారు.. ఐటీ నిపుణులు. లింకుపై క్లిక్ చేస్తే డబ్బు పొందవచ్చు అని మెసేజ్ వస్తే ఆ లింకును క్లిక్ చేయకపోవడమే మంచిదని వారు చెప్తున్నారు. ఆ లింకుపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం వుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు సైబరాబాద్‌లో జరిగిన సంఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌కు ఇటీవల గూగుల్ పే తరహాలోనే ఓ మెసేజ్ వచ్చింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మీ కేవైసీ, ఖాతా వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతాయని అందులో ఉంది. అందులో ఓ గూగుల్ లింక్ కూడా ఉంది. దీంతో ఆయన దాన్ని క్లిక్ చేసి వివరాలు నమోదు చేశారు. అవి సైబర్ నేరగాళ్లకు చిక్కడంతో ఆయన అకౌంట్లో ఉన్న రూ.5.29 లక్షలు మాయమయ్యాయి.
 
ఆ లింకు మాత్రమే కాకుండా.. ఇతర సోషల్ మీడియాల్లో షేరవుతున్న గూగుల్ పే స్క్రాచ్ కార్డు లింకును క్లిక్ చేస్తే చాలా డేంజర్. ఆ లింకు క్లిక్ చేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు వస్తాయంటూ వస్తున్న ఆ మెసేజులు క్లిక్ చేసినా, అందులో మీ వివరాలు పొందుపరిచినా మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా మంత్రుల బూతు పురాణంతో జనాలు పరుగో పరుగు: అచ్చెన్నాయుడు ప్రశ్న