తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. ఇటీవల మొబైల్ టారిఫ్‌లను జియో పెంచింది. పైగా, రెండు ప్లాన్లను ఎత్తివేసింది. అయితే, పెంచిన ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. పైగా, దిగువ తరగతి శ్రేణికి అందుబాటులో ఉన్న రెండు ప్లాన్లను రద్దు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆ రద్దు చేసిన రెండు ప్లాన్లను తిరిగి ప్రవేశపెట్టింది.
ఈ నేపథ్యంలో రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ మధ్యే పెంచిన మొబైల్ టారిఫ్‌లకు అనుగుణంగా నూతన ప్లాన్లను లాంచ్ చేసిన జియో అంతకు ముందు ఉన్న రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
ఇందులో రూ.98 ప్లాన్లను ఎంచుకునే యూజర్లకు 2 జీబీ డేటాతో పాటు.. 300 ఎంఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్ చేసుకునే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు చెప్పున వసూలు చేస్తారు.
ఇకపోతే, రూ.149 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణయించారు.