Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు..

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (19:46 IST)
స్మార్ట్ ఫోన్‌ల మార్కెట్‌లోకి అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో కూడిన మరో స్మార్ట్ ఫోన్ వచ్చింది. దీన్ని రియల్‌మి కంపెనీ విడుదల చేసింది. స్పోర్ట్స్ డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ22 ఎస్‌వోసీ, 3 జీబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎం10, రెడ్‌మి 7 ఫోన్లకు పోటీగా తీసుకొచ్చారు. 16 జీబీ, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి.
 
రియల్‌మి సి2 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజీ వేరియంట్ రకం ధర రూ.5,999గా నిర్ణయించారు. అలాగే, 3జీబీ ర్యామ్+32 జీబీ మోడల్ ధర రూ.7,999గా ఉంది. ఈ రెండు ఫోన్లు డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్ రంగుల్లో లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా అందుబాటులో ఉంది. మే 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ ప్రారంభం కానుంది.
 
రియల్‌మి సి2 ఫీచర్లను పరిశీలిస్తే, డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 9.0 పీ ఓఎస్, 6.1 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పీ22 ఎస్ఓసీ, 2జీబీ, 3జీబీ రకాలు ఉన్నాయి. ఇందులో వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 
 
అందులో ఒకటి 13 మెగాపిక్సల్ కాగా, మరోటి 2 మెగాపిక్సల్. ముందువైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. అలాగే, ఆర్టిఫిషియల్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. ఇందులో 32 జీబీ, 64 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం కలిగిన రెండు రకాల స్మార్ట్‌ఫోన్లు ఉండగా, అంతర్గత మెమొరీని ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే వెసులుబాటు ఉంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments