Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎప్పుడూ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు.. కంటిని కాస్త పట్టించుకోండి..

Advertiesment
ఎప్పుడూ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు.. కంటిని కాస్త పట్టించుకోండి..
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:57 IST)
కంటి చూపు ఎలా పని చేస్తుందో, మీ కంటి చూపుకి ఏ అలవాట్లు మంచివో, ఏ అలవాట్లు మీ కంటి చూపుకి ప్రమాదకరమో మీకు తెలుసా? వీటి గురించి తప్పక తెలుసుకోండి. గంటలతరబడి కంప్యూటర్ స్క్రీన్ ముందు పని చేసేటప్పుడు, కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి కళ్ళకు కొన్ని రకాల వ్యాయామాలను చేయటం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
రెండు చేతులను జోడించి వేడి పుట్టించే విధంగా ఘర్షణ జరపండి. వేడిగా ఉన్న ఈ చేతులను కళ్ళపై పెట్టుకోండి మరియు కాంతి కళ్ళపై పడకుండా జాగ్రత్త వహించండి. ఇలా చేస్తే కళ్ళు ఒత్తిడికి గురికాకుండా కాపాడుకోవచ్చు. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సరిపోయేంత తేమని అందించాలి. కళ్లు పొడిబారితే దురదగా, నొప్పిగా అనిపిస్తుంది. ఎర్రగా మారుతాయి. ఈ పరిస్థితి నుండి ఉపశమనం పొందడానికి కనురెప్పలను తరచుగా వాల్చుతూ ఉండాలి. టీవీ, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కేటాయించకూడదు. 
 
ప్రతి 20 నిమిషాలకి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం వలన మీ కళ్ళకు వ్యాయామాలను అందించిన వారవుతారు. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడపవలసి వస్తే, తీక్షణంగా దాన్నే చూడకుండా వివిధ రకాల వస్తువులను వివిధ కోణాల్లో చూస్తూ ఉండండి. కంప్యూటర్ స్క్రీన్ కాంతిని కూడా తగ్గించుకోండి. అలాగని మరీ డిమ్‌గా చేయకండి. ఇది కూడా ప్రమాదమే. ఎక్కువగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోండి, దాని వలన కళ్లపై ప్రభావం పడకుండా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు తాగితే నడుము నొప్పి మటాష్