చైనా మొబైల్ తయారీదారు హువావే సంస్థ స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతోంది. హువావే తన స్మార్ట్‌ఫోన్ హానర్ 10ఐని త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
హానర్ 10ఐ ప్రత్యేకతలు...
* ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్.
* 6.21 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే.
* ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్.
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్.
* 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.
* 24, 2, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.