Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకలిపై బ్లూలైట్ ఎఫెక్ట్...కళ్లు కూడా

ఆకలిపై బ్లూలైట్ ఎఫెక్ట్...కళ్లు కూడా
, బుధవారం, 20 మార్చి 2019 (14:29 IST)
నేటి ఆధునిక యుగంలో దాదాపు అందరూ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నారు. డిజిటల్ పరికరాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్‌ఫోన్‌ల గురించి. ప్రతి ఒక్కరి చేతిలో నేడు స్మార్ట్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రపంచాన్నంతా గుప్పట్లో ఉంచగల స్మార్ట్‌ఫోన్‌ల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అదే స్థాయిలో దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 
 
ఇక ఈ డివైసెస్ నుండి వచ్చే బ్లూలైట్ గురించి మాట్లాడుకుంటే, దీని వలన మన కంటి చూపు తగ్గిపోయి, మెల్లగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ బ్లూలైట్ వలన కంట్లోని రెటీనా దెబ్బతిని, క్రమంగా మాక్యులా క్షీణిస్తుంది. దీని వలన అంధత్వం త్వరగా సంభవిస్తుంది. అందుకే పరిశోధకులు బ్లూలైట్ ఎఫెక్ట్ పడకుండా కళ్లను కాపాడుకోవడం కోసం, UV మరియు బ్లూలైట్‌ని ఫిల్టర్ చేసే సన్‌గ్లాసెస్ ధరించమని, చీకటిలో స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.
 
తాజాగా జరిగిన పరిశోధనలలో బ్లూలైట్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నవారు బరువు పెరుగుతున్నట్లు కూడా గుర్తించారు. డిజిటల్ పరికరాల నుండి వెలువడే బ్లూలైట్‌ను చూడటం మొదలుపెట్టిన పావు గంట నుండి ఆకలి ప్రభావం మొదలవుతుంది. ఇక ఎక్కువసేపు దీనినే చూస్తూ ఉంటే ఆకలి మరింత ఎక్కువవుతుంది. దీని వలన మనం తీసుకునే ఆహార పరిమాణం పెరిగి లావైపోవడం ఖాయం. ఇక దీని వలన నిద్రలేమి సమస్య కూడా ఎక్కువవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్‌లతో గడిపే సమయం తగ్గించాలి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వుల పొడిని అప్పడాలపై చల్లుకుని తింటే?