Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రౌడీ బేబీ సాంగ్ మేకింగ్ వీడియో.. ప్రభుదేవా కొరియోగ్రాఫీతో

Advertiesment
రౌడీ బేబీ సాంగ్ మేకింగ్ వీడియో.. ప్రభుదేవా కొరియోగ్రాఫీతో
, శనివారం, 2 మార్చి 2019 (17:50 IST)
యూట్యూబ్‌లో రౌడీ బేబీ పాట అదరగొట్టింది. ఈ ఏడాది జనవరి 2న ఈ పాటను అప్‌లోడ్ చేయగా.. ఇప్పటికే 20 కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం. మారి2లోని ఈ పాటలో తమిళ కొలవెరి ఫేమ్ స్టార్ ధనుష్, సాయి పల్లవి వెరైటీ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తెలుగు మూవీ ఫిదాలోని వచ్చిండె సాంగ్ ఇప్పటివరకు సాయి పల్లవికి ఓ రికార్డుగా ఉండేది.
 
ఈ పాటను యూట్యూబ్‌లో 18 కోట్ల 35 ల‌క్ష‌ల మంది చూశారు. ప్రస్తుతం ఈ రికార్డును రౌడీ బేబీ బ్రేక్ చేసింది. గతంలో కొలవెరి డి సాంగ్‌ను 17 కోట్ల 50 ల‌క్ష‌ల మంది చూశారు. ఈ పాటను కూడా రౌడీ బేబీ బీట్ చేసి బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. 
 
గతేడాది డిసెంబర్‌లో ఈ మారి 2 మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రౌడీ బేబీ పాటకు ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా ఈ పాటకు కొరియాగ్రఫీ చేయగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేకింగ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెళ్తే రాహుల్ గాంధీతోనే డేటింగ్‌కు వెళ్తా.. కరీనా కపూర్