Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిపల్లవి అదుర్స్.. రౌడీ బేబీతో మళ్లీ ధనుష్‌ను వెనక్కి నెట్టింది.. (వీడియో)

సాయిపల్లవి అదుర్స్.. రౌడీ బేబీతో మళ్లీ ధనుష్‌ను వెనక్కి నెట్టింది.. (వీడియో)
, మంగళవారం, 22 జనవరి 2019 (18:02 IST)
''ఫిదా'' హీరోయిన్ సాయిపల్లవి.. విభిన్న పాత్రలు ఎంచుకోవడంలో దిట్ట. అందుకే ఆమెకు యంగ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చింది. నటన, డ్యాన్స్ పరంగా మంచి మార్కులేసుకున్న ఈ ప్రేమమ్ హీరోయిన్.. తాజాగా కొత్త రికార్డును సొంతం చేసుకుంది. 
 
యూట్యూబ్‌లో వచ్చిండే పాటకు భారీ వ్యూస్ వచ్చాయి. నిన్నటికి నిన్న ధనుష్ కొలవెరి సాంగ్ పేరిట వున్న రికార్డును బద్ధలు కొట్టింది. తాజాగా అదే ధనుష్‌తో మారి-2 సినిమా కోసం రాసిన రౌడీ బేబీ పాటతో రికార్డు సృష్టించింది. రౌడి బేబీ పాటతో కొత్త రికార్డును సాయిపల్లవి నెలకొల్పింది. 
 
జనవరి 2న యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ పాట తక్కువ రోజుల్లోనే వంద మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఓ సౌత్ ఇండియన్ సినిమాలోని పాట తక్కువ రోజుల్లోనే ఇన్ని వ్యూస్‌ని రాబట్టుకోవడం అరుదైన విషయం. మొత్తం మీద యూట్యూబ్ రికార్డ్‌లని ఒడిసిపట్టుకోవడంలో సాయి పల్లవి, ధనుష్ పోటీ పడుతున్నారు. కలిసి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసురన్ కోసం.. 40 ఏళ్ల హీరోయినా?