ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్లలో ఒకడైన రొనాల్డో హ్యాట్రిక్ గోల్ కొట్టాడు. ఈ గోల్ కొట్టడంతో ఆతని ప్రేయసి జార్జినా కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం రొనాల్డో హ్యాట్రిక్ గోల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఛాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ సిరీస్ నాకౌట్ దశలో భాగంగా రెండో లీగ్ మ్యాచ్ ఇటలీలోని టురిన్ నగరంలో మంగళవారం జరిగింది.
జువెంటస్ జట్టు అట్లెటికో మాడ్రిడ్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌కు 27వ నిమిషంలో జువెంటస్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తొలి గోల్ సాధించి మైదానాన్ని ఫ్యాన్స్ చప్పట్లతో అలరింపజేశాడు. తొలి అర్థభాగం చివరికల్లా 1-0 తేడాతో జువంటస్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. తదనంతరం జరిగిన రెండో అర్థభాగంలో రొనాల్డో తన రెండో గోల్ సాధించాడు.
ఆపై పెనాల్టీతో మరో గోల్ సాధించి అదరగొట్టాడు. దీంతో 3-0 తేడాతో జువంటస్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఇంకా ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్లోకి చేరుకుంది. హ్యాట్రిక్ గోల్‌తో జట్టుకు విజయం సంపాదించి పెట్టిన రొనాల్డోకు మద్దతుగా ఆయన ఫ్యాన్స్ ప్రశంసలతో మద్దతు తెలిపారు. అలాగే రొనాల్డో భార్య రొనాల్డో హ్యాట్రిక్ గోల్‌కు కంటతడి పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రొనాల్డో రికార్డులు..
రొనాల్డో ఇప్పటివరకు యూరప్ క్లబ్ పోటీల్లో 124 గోల్స్ సాధించాడు.
తద్వారా ప్రపంచ ఫుట్ బాల్ పోటీల్లో అత్యధిక గోల్స్ సాధించిన లియోనల్ మెస్సీకి తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఇంకా ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో రొనాల్డో 8 హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. అలాగే ఐదు ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్‌ను సంపాదించిపెట్టాడు.