మోటోరోలా నుంచి ఎడ్జ్ ప్ల‌స్‌ స్మార్ట్‌ఫోన్- ధర రూ.75,000

Webdunia
బుధవారం, 20 మే 2020 (19:24 IST)
Motorola Edge+
మొబైల్స్ త‌యారీ సంస్థ మోటోరోలా నుంచి మోటోరోలా ఎడ్జ్ ప్ల‌స్‌ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. మోటోరోలా ఎడ్జ్ ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ కేవ‌లం థండ‌ర్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో మాత్ర‌మే విడుద‌లైంది. దీని ధర రూ.74,999.

ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భ్యం కానుంది. దీనికి గాను ప్ర‌స్తుతం ప్రీ ఆర్డర్ల‌ను ప్రారంభించారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.7,500 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. 
 
ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌, రివ‌ర్స్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక గతంలో వ‌చ్చిన ఇత‌ర మోటో ఫోన్ల క‌న్నాఈ ఫోన్‌లోని స్పీక‌ర్ 60 శాతం ఎక్కువ సౌండ్ ఇస్తుంది. 
 
ఈ ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాతోపాటు 16 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న అల్ట్రావైట్ యాంగిల్ లెన్స్‌, 8 మెగాపిక్స‌ల్ టెలిఫొటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి స‌హాయంతో ఏకంగా 6కె వీడియోల‌ను షూట్ చేసుకోవ‌చ్చు. 
 
ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ ఉన్న ఓలెడ్ ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగ‌న్ 865 అధునాతన ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌, 5జి వంటి అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ల‌భిస్తోంది.
 
మోటోరోలా ఎడ్జ్ ప్ల‌స్ స్పెసిఫికేష‌న్లు…
* 108, 16, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 25 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే
* 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
* 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6 802.11 ఏక్స్
* బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌
* 256 జీబీ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్
*  వైర్‌లెస్ చార్జింగ్‌, రివ‌ర్స్ వైర్‌లెస్ చార్జింగ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments