Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.98 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో.. కస్టమర్లకు షాక్

Webdunia
మంగళవారం, 19 మే 2020 (19:07 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు షాకిచ్చింది. రూ.98తో అతి తక్కువగా కలిగిన ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను జియో తొలగించింది. ఇంకా 28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ ధరను ప్రస్తుతం రూ.129కి పెంచేసింది. 
 
ఇక, తొలగించిన రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 300 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియోకు కాల్స్, ల్యాండ్ లైన్ కాలింగ్ ప్రయోజనాలు వంటి ప్రయోజనాలు 28 రోజుల కాలపరిమితితో లభించేవి.
 
అయితే రూ. 999 ప్లాన్‌ను ప్రారంభించిన నేపథ్యంలో రూ. 98 ప్లాన్‌ను తొలగించింది. రూ. 999 ప్లాన్‌లో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల కాలపరిమితితో ఈ ప్లాన్ అందుబాటులో వుంటుంది.
 
ఇక 98 రూపాయల నుంచి రూ.129కి పెంచిన ప్రీ-పెయిడ్ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలీడిటీతో 2జీబీ టోటల్ డేటా, జియో-టు-జియో అన్ లిమిటెడ్ కాల్స్, వెయ్యి నిమిషాల నాన్-జియో కాల్స్, 300 మెసేజ్‌లు లభిస్తాయి. ఇదే ప్రస్తుతం జియో నుంచి అతి తక్కువ ధరతో వినియోగదారులకు లభించే ప్రీ-పెయిడ్ ప్లాన్ అని రిలయన్స్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments