Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఏంటది..?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (22:26 IST)
గూగుల్ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్ జత అయ్యింది. యూజర్లు ఇంతకు ముందు సందర్శించిన ప్రదేశాలకు సులభంగా నావిగేట్ చెయ్యడానికి గూగుల్ మ్యాప్స్ త్వరలో కొత్తగా 'గో' టాబ్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ప్లోర్, సేవ్డ్‌ ట్యాబ్స్‌ ఫీచర్‌ స్థానంలో ఇక మీదట గో ట్యాబ్ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్, ఐఓస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. గూగుల్ మ్యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. సరికొత్త ఫీచర్లను తీసుకుని వస్తూ ఉంది. స్ట్రీట్ వ్యూ, కమ్యూనిటీ ఫీడ్ వంటి ఫీచర్లను ఇటీవలే తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. 
 
తాజా ''గో'' టాబ్‌ ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే షాపింగ్ మాల్స్, స్కూల్స్, జిమ్ వంటి ప్రదేశాలను పిన్ చేసుకోవచ్చు. దారిలో ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత సమయం పడుతుంది వంటి విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. 
 
గూగుల్ మ్యాప్స్‌లో ఇల్లు, పనిచేసే ప్రదేశాలను మాత్రమే సేవ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే ప్రదేశాలను జోడించుకోవచ్చు. ప్రతిసారి ఈ ప్రదేశాల కోసం సెర్చ్ చేయకుండా.. ఈ ఫీచర్ ద్వారా మన వ్యక్తిగత వాహనాలలో, ప్రజా రవాణాలలో ప్రయాణం చేసినప్పుడు ఏ రూట్‌లో ప్రయాణిస్తే తొందరగా గమ్యానికి చేరుకుంటామో తెలుసుకునేలా ఉంటుంది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments