Burevi తుఫాన్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఏ తుఫాన్ అయినా క్రమంగా ముందుకు నడిచి తీరం దాటుతుంది. కానీ ఈ తుఫాన్ మాత్రం గత 48 గంటలుగా సముద్రంలోనే తిష్ట వేసి ఒకేచోట అటుఇటూ కదలకుండా తిష్టవేసి కూర్చుంది.
మరో 12 గంటల పాటు అది అక్కడే స్థిరంగా వుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. మరోవైపు దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.
హిందూ మహాసముద్రం, అరేబియా మహా సముద్రం నుంచి వీస్తున్న బలమైన గాలులు కారణంగా బురేవి తుఫాన్ తన దిశను మార్చుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. అది తమిళనాడులోని చెన్నై, పుదుచ్చేరి మీదుగా ఏపీ వైపు దూసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఇప్పటికే నివర్ తుఫానుతో తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ బురేవి వెనక్కి తిరిగి వస్తే పరిస్థితి గందరగోళంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.