Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెజిటబుల్ టమోటా సూప్, ఎలా చేయాలి?

వెజిటబుల్ టమోటా సూప్, ఎలా చేయాలి?
, శనివారం, 5 డిశెంబరు 2020 (21:52 IST)
కూరగాయల సూప్ క్లాసిక్ ఫేవరెట్, ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఇళ్లలోనూ చేసుకుంటుంటారు. ఈ సూప్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, కాబట్టి మలబద్దకంతో బాధపడేవారికి, బరువు తగ్గడానికి కూడా మంచిది.
 
కావలసినవి
1 1/2 కప్పుల టమోటాలు, తరిగినవి
1/4 కప్పు ఉల్లిపాయలు, తరిగినవి
1/2 కప్పు క్యాబేజీ, తరిగినవి
1/4 కప్పు క్యాప్సికమ్, తరిగినవి
¼ కప్ ఫ్రెంచ్ బీన్స్, పొడవుగా తరిగినవి
2 స్పూన్ల నూనె
రుచికి ఉప్పు
 
తయారుచేసే విధానం:
ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేడి చేయండి. 1 నిమిషం ఓ మోస్తరు మంట మీద ఉల్లిపాయలు వేసి వేయించాలి. టొమాటోలు, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజీ మరియు క్యాప్సికమ్ వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి. 1½ కప్పుల నీరు వేసి, బాగా కలపండి.
 
మూడు విజిల్స్ వచ్చేవరకూ ప్రెజర్ కుక్కర్లో ఉడికించాలి. ఆ తర్వాత అది పేస్టులా మారుతుంది. ఈ పేస్టుతో పాటు మిగిలిన పదార్థాలను లోతైన నాన్-స్టిక్ పాన్లో వేయండి. అందులో ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపాలి. మోస్తరు మంట మీద 2 నిమిషాలు ఉడికించి, అప్పుడప్పుడు కదిలిస్తుండాలి. అంతే.. వేడివేడి సూప్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాలంలో చిరుధాన్యాలు.. ఇలా తీసుకుంటే ఒబిసిటీ పరార్