Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియ్ న్యూ ఆఫర్ : రూ.247 రీచార్జ్‌తో 84 డేస్ వ్యాలిడిటి

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:11 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లలో 297 ఆఫర్‌పై రూ.50 రాయితీని ఇచ్చింది. అంటే రూ.247కు రీచార్జ్ చేసుకున్నట్టయితే 84 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ పొందాలంటే కేవలం జియో మై యాప్‌లోకి వెళ్లి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మై జియో అప్లికేషన్‌లో రూ.297ను రూ.247కే అందిస్తున్నారు. 
 
కాగా, దేశీయ టెలికాం రంగంలోకి రెండేళ్ళ క్రితం అడుగుపెట్టిన రిలయన్స్ జియో 28 కోట్ల మంది కస్టమర్లను చేజిక్కించుకున్న విషయం తెల్సిందే. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు. ఫలితంగా పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తాజాగా రూ.247కే 84 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు.. అదనంగా 500 ఎంబీ 4జీ డేటాను కూడా ఇవ్వనుంది. అన్‌లిమిటెడ్ పరిమితి దాటిన పక్షంలో డేటా వేగం 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. కాగా, రూ.349 ప్యాక్‌పై రూ.50 ఆఫర్ ఇస్తూ వస్తుంది. అంటే రూ.349 ప్యాక్‌ రూ.299కే అందిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments