కొత్త డేటా ప్లాన్లతో బీఎస్ఎన్ఎల్ అదుర్స్: ప్రతిరోజు 5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:14 IST)
ఇటీవలే అన్ని టెలికం కంపెనీలు భారీగా రీచార్జి ధరలను పెంచేశాయి. వినియోగదారులపై భారం మోపాయి. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. 
 
ఇంకా కొత్త డేటా ప్లాన్లతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటా అందించేందుకు కొన్ని దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్లలో రూ.599 అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ ప్లాన్‌ కింద ప్రతిరోజు 5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. వీటితో పాటు జింగ్‌మ్యూజిక్‌ను ఉచితంగా పొందవచ్చు. 
 
ఇక అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు అన్‌లిమిటెడ్‌ డేటా అందిస్తోంది. ఇన్ని ఆఫర్లు ఉన్న ప్లాన్‌ వ్యాలిడిటీ ఏకంగా 84 రోజులు. ఈ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న ప్లాన్ మరే టెలికాం సంస్థ అందించడం లేదని బీఎస్ఎస్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments