Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రీ-పెయిడ్ ధరలను పెంచేసిన రిలయన్స్ జియో

ప్రీ-పెయిడ్ ధరలను పెంచేసిన రిలయన్స్ జియో
, సోమవారం, 29 నవంబరు 2021 (09:53 IST)
వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా తరహాలోనే రిలయన్స్ జియో కూడా అదే బాట పట్టింది. తాజాగా అన్ని ప్రీపెయిడ్, జియోఫోన్‌, డేటా యాడ్ -ఆన్ ప్లాన్ల రీచార్జ్‌ రేట్లను 25 శాతం వరకు పెంచింది. కొత్త రేట్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయి. పాత ప్లాన్లలో రీఛార్జ్ చేసుకోవడానికి ఈ నెల 31 దాకా సమయం ఉంటుంది. 28- రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ రేటును రూ.129 నుండి రూ. 155కు పెంచారు.
 
అలాగే 24 రోజుల వాలిడిటీ ఉండే 1జీబీ ఇంకా ఒక రోజు ప్లాన్ ధరను రూ.149 నుంచి రూ. 179కు పెంచారు. రూ. 199 ప్లాన్‌కు ఇక నుంచి రూ. రూ. 239 కట్టాలి. ఇది 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా అందిస్తుంది. రూ. 249 ప్లాన్ ధరను రూ. 299కి పెంచారు. తాజాగా డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. 
 
జియో తన డేటా టాప్-అప్ ప్లాన్ కోసం టారిఫ్‌ను కూడా పెంచుతోంది. 51 రూపాయల 6GB డేటా టాప్-అప్ ప్యాక్ ఇప్పుడు రూ. 61, రూ. 101, 12GB డేటా టాప్-అప్ ప్యాక్ ధర రూ. 121, రూ. 251 50GB డేటా టాప్-అప్ ప్యాక్ ధర రూ.301. ప్రస్తుతం ఉన్న అన్ని ఛానెల్‌ల నుంచి కస్టమర్‌లు ఈ సవరించిన ప్లాన్‌లన్నింటినీ ఎంచుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు: సౌత్ ఈస్టర్న్ రైల్వే డివిజన్‌లో 1785 ఉద్యోగాలు