Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొండిపట్టు వదిలిన ట్విట్టర్-కేంద్ర ఐటీ విధానాలకు గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 31 మే 2021 (18:07 IST)
కేంద్ర ప్రభుత్వ ఐటీ విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్రం కొత్తగా ఐటీ విధానాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఈ నియమావళిని అంగీకరించాయి.

అయితే వీటిలో కొన్ని మార్పులు చేయాలంటూ ప్రతిపాదనలు పెట్టాయి. అయితే ఈ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం కాస్త మొండిగా వ్యవహరించింది. ఇదే తరహాలో ట్విట్టర్ కూడా ఐటీ విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
సామాజిక మాధ్యమాల కట్టడికి మూడు నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వాటి అమలుకు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువు మే 25తో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మే 26న రంగంలోకి దిగింది. 
 
సవరించిన నిబంధనల అమలుకు సామాజిక మాధ్యమాలు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించింది. అయితే అప్పటి వరకు మౌనంగా ఉన్న ఫేస్‌బుక్ ఉన్నట్లుండి కేంద్ర నియమావళికి ఓకే చెప్పేసింది.

అయితే ఇదే సమయంలో ట్విట్టర్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు తనిఖీకి రావడం సంచలనంగా మారింది. అనంతరం తమ ఉద్యోగుల భద్రతపై, వాక్స్వాతంత్ర్యానికి కలుగుతున్న ముప్పుపై ఆందోళన కలుగుతోందని ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments