Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెంట్రల్ విస్తా నిర్మాణం ఆపే ప్రసక్తే లేదు : పిటిషనర్‌కు లక్ష అపరాధం...

Advertiesment
సెంట్రల్ విస్తా నిర్మాణం ఆపే ప్రసక్తే లేదు : పిటిషనర్‌కు లక్ష అపరాధం...
, సోమవారం, 31 మే 2021 (13:02 IST)
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తలపెట్టింది. ఈ ప్రాజెక్టు ముమ్మాటికీ అవసరమేనని ఢిల్లీ హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీంతో ఆ పనులు చేసుకునేందుకు లైన్ క్లియర్ చేసింది. 
 
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపేయాలంటూ వేసిన వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం.. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్‌కు లక్ష రూపాయాల జరిమానాను విధించింది.
 
కరోనా వైరస్ మహమ్మారి బూచిని చూపించి సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీలు అక్కడ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన పని లేదని పేర్కొంది. 
 
కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్‌లైన్‌కు అనుగుణంగా నవంబర్ లోపు షాపూర్ జీ పల్లోంజీ సంస్థ.. సెంట్రల్ విస్టాను పూర్తి చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు న్యాయబద్ధతపై ఇప్పటికే సుప్రీం కోర్టు విచారించిందని గుర్తు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై విపక్ష నేతలు పెడుతున్న గగ్గోలు ఇంతటితో ముగిసినట్టే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ పెళ్లి కుదిరింది, నా డెత్ టైమ్ ఫిక్స్ చేశానంటూ ప్రియురాలికి సెల్ఫీ వీడియోలో...