Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్యావసరాలను అందిస్తూ కోవిడ్ 19తో జరుగుతున్న యుద్ధంలో కమ్యూనిటీలకు ఏబీ ఇన్బెవ్‌ తోడ్పాటు

Advertiesment
Ab Inbev India
, బుధవారం, 26 మే 2021 (19:40 IST)
కమ్యూనిటీల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సంగారెడ్డిలో ఉన్న ఏబీ ఇన్బెవ్‌ ఇండియా క్రౌన్‌ అండ్‌ చార్మినార్‌ బ్రూవరీస్‌ నేడు కోవిడ్‌ 19తో ప్రభావితమైన తమ చుట్టు పక్కల కమ్యూనిటీలకు అవసరమైన రేషన్‌ కిట్స్‌ అందించడం ద్వారా మద్దతునందించేందుకు ప్రతిజ్ఞ చేసింది.

సంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలకు (మల్లేపల్లి, గుంటపల్లి, గోపులారం, తెర్‌పోల్, గొల్లపల్లి, శివంపేట, చక్రియాల్, చోట్కూర్, ఫసల్‌వాడీ, లింగంపల్లి, వెండికోల్) చెందిన 2000 కుటుంబాలకు 15 కేజీల రేషన్‌ కిట్స్‌ను అందించారు. వీటిలో నాణ్యమైన బియ్యం, ఆటా/గోధుమ పిండి, నూనె, మసాలాలు, విభిన్న రకాల పప్పు దినుసులు, ఉప్పు, పంచదారతో పాటుగా శానిటైజర్లు, సబ్బులు ఉన్నాయి.
 
ఏబీ ఇన్బెవ్‌ ఇండియా ఇప్పుడు స్థానిక అధికారులు మరియు వైద్య అధికారులతో అతి సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి వద్ద ప్రభావితమైన కమ్యూనిటీలకు మద్దతునందిస్తున్నారు. ఈ నెలారంభంలో, ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవర్‌ 300కు పైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 8 వేలకు పైగా అవసరమైన సహాయాన్ని అందించే కిట్స్‌ను కోవిడ్ 19 ప్రభావిత కుటుంబాలకు అందించడంతో పాటుగా దేశ వ్యాప్తంగా 50కు పైగా గ్రామాలలో ఐదు లక్షల మాస్క్‌లు, 5 వేలకు పైగా టెస్ట్‌ కిట్స్‌ను సైతం అందించింది.
 
‘‘మా కమ్యూనిటీలకు మద్దతునందించిన మహోన్నతమైన చరిత్ర మాకుండటమే కాదు, సంక్షోభ సమయంలో అవసరమైన సంఘీభావం అందించడంలోనూ మాకు ఘనమైన చరిత్ర ఉంది. మా కమ్యూనిటీలు, ప్రజల ఆరోగ్యం, భద్రత మాకు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యతగా ఉంటూనే ఉంటుంది. సమాజం నుంచి తమ వ్యాపారం వేరు కాదని మేము అర్థం చేసుకున్నాం మరియు కమ్యూనిటీలు, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులకు మా నిరంతర మద్దతు కొనసాగించడం ద్వారా కోవిడ్‌ 19తో జరుగుతున్న ఈ యుద్ధంలో విజయవంతమవుతామనే నమ్మకంతో ఉన్నాం. కలిసికట్టుగా మనం ఏదైనా సాధించగలం’’ అని అనసూయ రే, వైస్‌ ప్రెసిడెంట్‌, కార్పోరేట్‌ ఎఫైర్స్‌- సౌత్‌ ఆసియా, ఏబీ ఇన్బెవ్‌ అన్నారు.
 
గత సంవత్సరం ఏబీ ఇన్బెవ్‌ దాదాపు 15 లక్షలకు పైగా ఫ్రంట్‌లైన్‌ కార్మికులపై ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణా మరియు హర్యానా రాష్ట్రాలలో ప్రభావం చూపడంతో పాటుగా 2,50,000 బాటిల్స్‌ హ్యాండ్‌ శానిటైజర్లు, 3750 పీపీఈ కిట్స్‌, 25వేల ఎఫ్‌ఎఫ్‌పీ2 మాస్కులు అందించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం పెడతానని ఆశచూపి అంబులెన్స్‌లో గ్యాంగ్ రేప్