Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేయనున్న ప్రధాని మోడీ సర్కారు!

బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేయనున్న ప్రధాని మోడీ సర్కారు!
, బుధవారం, 26 మే 2021 (10:26 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక మంది బతుకులు చితికిపోయాయి. ముఖ్యంగా, పేదలు ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయారు. ఇలాంటి వారికి గత కరోనా తొలి దశ సమయంలో మోడీ సర్కారు కొత్త మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 
 
ఇపుడు మరోమారు తీపి కబురు చెప్పింది. హిజ్రాల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేయనుంది. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్‌జెండర్లకు ఈ డబ్బులు అందుతాయి. ఇందుకోసం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ సహాయం కోరుతూ కాల్స్, ఈమెయిల్స్ చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
 
ట్రాన్స్‌జెండర్ సంక్షేమానికి నోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు ప్రాథమిక అవసరాల కోసం తక్షణ సహాయంగా రూ.1,500 జీవనాధార భత్యాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సహాయం ట్రాన్స్‌జెండర్ సమాజానికి రోజువారీ అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.
 
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం పనిచేస్తున్న ఎన్జీఓలు, కమ్యూనిటీ-ఆధారిత సంస్థలు (సీబీఓ) ఈ ఆర్థిక సాయం గురించి ట్రాన్స్‌జెండర్లలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది లాక్‌డౌన్‌లో కూడా ఇలానే ఆర్థిక సాయం చేసింది. రేషన్ కిట్లను అందించింది. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు అందించాలి. ట్రాన్స్‌జెండర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముకేష్ అంబానీకి సీఎం జగన్ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?