ఐపీఎల్‌లో అదుర్స్.. ఐదువేల పరుగుల మైలురాయి.. ధోనీకొక్కడికే సాధ్యం..!

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (10:00 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. లోయర్ ఆర్డర్‌లో దిగి అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకోవడం మహీకి మాత్రమే సాధ్యమన్నాడు. 
 
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టిన ధోనీ.. ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ధోనీ పెర్ఫామెన్స్‌పై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సెహ్వాగ్.. ఈ ఫీట్ ధోని ఒక్కడికే సాధ్యమన్నాడు. 
 
ధోనీ గొప్ప ఆటగాడని సెహ్వాగ్ కొనియాడాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇక ధోనీ ఆడింది మూడు బంతులే అయినా.. తనదైన మార్క్ చూపించాడు. 
 
ధోనీ బ్యాటింగ్ చేసే సమయంలో జియో సినిమా వ్యూస్ సంఖ్య కోటీ 80 లక్షలకు చేరింది. ఇంకా  ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా ధోనీ తన రికార్డును పదిలం చేసుకున్నాడు. ఇలాంటి ఫీట్స్‌ ధోనీ వల్లే సాధ్యమన్నాడు సెహ్వాగ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments