విశాఖపట్టణంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ 117 పరుగులకే కుప్పకూలింది. వరుణ దేవుడు కాస్త తెరపివ్వడంతో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు తడబాటుకు లోనయ్యారు. ఫలితంగా 117 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
ముంబై వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం మూడో విశాఖ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరగాల్సివుంది. కానీ, గత రెండు మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తూ వచ్చింది. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం ఆగడంతో మ్యాచ్‌ను ప్రారంభించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. దాదాపు సగం ఓవర్లు (26 ఓవర్లు) మాత్రమే ఆడి 117 పరుగులకు ఆలౌటయ్యింది. స్టార్క్, అబాట్, ఎల్లీస్ పేస్ అటాక్ ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్ వెలవెలబోయింది. కోహ్లీ(31), అక్షర్ పటేల్(29) ఆ కాస్త రాణించడంతో.. భారత్ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది. గిల్, సూర్య, షమీ, సిరాజ్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, పాండ్య, కుల్‌దీప్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లతో విజృంభించగా.. అబాట్ 3, ఎల్లీస్ 2 వికెట్లు పడగొట్టాడు.