ఐపీఎల్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు నవంబరులో?

Webdunia
ఆదివారం, 23 మే 2021 (14:30 IST)
స్వదేశంలో జరుగుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ పోటీలు కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా వాయిదాపడ్డాయి. సగం మ్యాచ్‌లు పూర్తికాగా, మిగిలిపోయిన మ్యాచ్‌లను సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మ్యాచులు సెప్టెంబ‌ర్ 15 నుంచి అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు మిగిలిన 31 మ్యాచులు ఆడించ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 
 
ఐపీఎల్ మిగిలిపోయిన మ్యాచుల‌ను యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడింది.60 ల‌లో 31 మ్యాచ్‌లు ఇంకా జరగలేదు.
 
ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ చివరకు ఒక ప‌రిష్కారం కనుగొన్న‌ది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో జరుగుతాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఇదేస‌మ‌యంలో ఈ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌ కోసం ఇంగ్లండ్, యూఏఈల‌ను బోర్డు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.
 
భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2014 లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా కారణంగా 2020 సీజన్ కూడా యూఏఈలోనే పూర్త‌యింది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌స్తుత టోర్న‌మెంట్ సీజ‌న్‌ను యూఏఈలో పూర్తిచేయాల‌ని బోర్డు భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

నీట్ యూజీ పరీక్ష రద్దు... ఫీజు వాపసు గడువు జూన్ 22కి పెంపు

ఎన్టీఆర్ 103వ జయంతి.. చంద్రబాబు నివాళి.. మహానాడు ఏం టెక్నాలజీ గురూ..

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments