యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. యూఎఇలో గత తొమ్మిదేళ్లుగా వుంటున్న ఓ కన్నడిగుడికి రూ. 24 కోట్ల లాటరీ తగిలింది. తనకు లాటరీ తగిలిందంటే తొలుత అతడు నమ్మలేదు. కానీ స్వయంగా లాటరీ నిర్వాహకులే ఫోన్ చేసి చెప్పడంతో ఎగిరి గంతేశాడు.
వివరాల్లోకి వెళితే.. కర్నాటక శివమొగ్గ జిల్లాకు చెందిన శివమూర్తి యూఎఇలో లాటరీ విజేతగా ప్రకటించారు. గత పదిహేనేళ్లుగా మెకానికల్ ఇంజినీరుగా అక్కడే వుంటున్న శివమూర్తి అప్పటి నుంచి లాటరీ టిక్కెట్లు కొంటూ వుండేవాడు. ఐతే ఫిబ్రవరి 17న జరిగిన డ్రాలో ఆయకు లక్ తగిలింది.
గల్ఫ్ న్యూస్ గురువారం నాడు ఆయనకు రూ. 24 కోట్ల లాటరీ తగిలిందని చెప్పడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. తనకు వచ్చిన డబ్బుతో కర్నాటకలోని తన స్వగ్రామంలో పెద్ద ఇల్లు నిర్మిస్తానని, మిగిలిన డబ్బున తన పిల్లల భవిష్యత్తుకు వినియోగిస్తానని చెప్పారు.