Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ ఫ్లైటెక్కిన సౌరవ్ గంగూలీ... ఐసీసీ ర్యాంకుల్లో ఇద్దరే ఇండియన్స్...

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:26 IST)
ఈ నెల19వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ పోటీల కోసం ఈ టోర్నీలో పాల్గొనే 8 జట్లూ ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ దుబాయ్‌ బయలుదేరాడు. 
 
పూర్తిగా బయో సెక్యూర్‌ వాతావరణంలో ఈనెల 19 నుంచి ఆరంభంకానున్న మెగా టోర్నీ సన్నాహాలను దాదా పరిశీలించనున్నాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. దుబాయ్‌, షార్జా, అబుదాబి వేదికల్లో ఐపీఎల్‌ జరగనుంది. 
 
'ఐపీఎల్‌ కోసం దుబాయ్‌ వెళ్తున్నాను. ఆరు నెలల్లో ఇదే నా మొదటి విమాన ప్రయాణం. క్రేజీ లైఫ్‌ చేంజెస్' అంటూ దాదా ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానం ముందు దిగిన ఫొటోను కూడా గంగూలీ షేర్‌ చేశారు.
 
ఇదిలావుంటే, బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇందులో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ 877 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన మలన్‌ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరచుకున్నాడు. 
 
మలన్‌ తర్వాత పాక్‌ స్టార్‌ ప్లేయర్‌ బాబర్‌ అజామ్‌(869), అస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ పించ్‌(835), కేఎల్‌ రాహుల్‌(824), కోలిన్‌ మున్రో(785) టాప్‌-5లో కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(673) తొమ్మితో స్థానంలో నిలిచాడు. ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత క్రికెటర్లకు మాత్రమే మెరుగైన స్థానాలు దక్కాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments