పాపా... కమాన్ పాపా... ధోనీ కూతురు జివా... సిక్సర్‌తో చెలరేగిన ధోనీ...(video)

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (13:42 IST)
చెన్నై సూపర్ కింగ్స్ ఆట అనగానే ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ కుమార్తె జివా కనబడుతోంది. మంగళవారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ చివరి వరకూ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో ఖచ్చితంగా సిక్సర్ లేదా ఫోర్ కొట్టాల్సిన పరిస్థితి. 
 
ఈ స్థితిలో ధోనీ స్ట్రైకింగ్ చేస్తున్నాడు. గ్యాలెరీలో వున్న ధోనీ కుమార్తె తన తండ్రిని చూస్తూ... పాపా.. కమాన్ పాపా.. అంటూ కేక వేసింది. అంతే... ధోనీ భారీ సిక్సర్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని షురూ చేశాడు. దీనితో ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందింది చెన్నై సూపర్ కింగ్స్.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్సమన్ వాట్సన్ 26 బంతుల్లో 4x4, 3x6 కొట్టి 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత మహేంద్రసింగ్ ధోని 35 బంతుల్లో 2x4, 1x6 కొట్టి 32 పరుగులతో నాటవుట్‌గా నిలిచి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులతో విజయం సాధించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments