ప్రస్తుతం స్వదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ దశ పోటీలు జరుగుతున్నాయి. శనివారం నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడింది ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజయభేరీ మోగించింది.
అయితే, ఈ మ్యాచ్ అనంతరం జట్టు సహచరులను కెప్టెన్ ధోనీ ఆటపట్టించాడు. ముఖ్యంగా, బౌలర్ కేదార్ జాదవ్‌ను ఆపట్టించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచిన సమయంలో కేదార్ జాదవ్ క్రీజులో ఉన్నాడు. ఈ విజయం నీకెలా అనిపిస్తోందంటూ టీమ్ మేట్ మోహిత్ చౌహాన్.. జాదవ్‌ను ప్రశ్నించాడు.
దీనిపై అతడు స్పందిస్తూ, చాలా సంతోషంగా ఉంది. గతేడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనూ ముంబైపై గెలిచినప్పుడు నేనే క్రీజులో ఉన్నాను. ఇప్పుడూ అదే జరిగింది అని చెబుతూ పోయాడు. మధ్యలో జోక్యం చేసుకున్న ధోనీ.. మరి ఈసారీ ఇంటికెళ్లిపోతావా అంటూ ప్రశ్నించాడు.
ధోనీ ఇలా అడగటానికి కారణం లేకపోలేదు. గతేడాది ఆ మ్యాచ్ తర్వాత గాయంతో కేదార్ జాదవ్ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో ఈసారీ అలాగే చేస్తావా అంటూ ధోనీ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో పక్కనే ఉన్న టీమ్ మేట్స్ అంతా పెద్దగా నవ్వారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
సాధారణంగా ఒక జట్టు కెప్టెన్‌గా ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. కానీ, మ్యాచ్ అనంతరం జట్టు సహచరులతో ఎంతో సరదాగా గడుపుతాడు. జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయినా కూడా తన కంటే జూనియర్ ప్లేయర్స్‌ను ఆట పట్టిస్తాడు. తాజాగా చెన్నై, బెంగళూరు మ్యాచ్ తర్వాత కూడా తన టీమ్ ప్లేయర్ కేదార్ జాదవ్‌ను ఆట పట్టించాడు. చెన్నై విమానాశ్రయంలో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది.