మేము ఫ్రెండ్స్.. భేటీకి రెడీ.. ట్రంప్- మోదీ ప్రకటన.. కానీ 100 శాతం సుంకాలు?

సెల్వి
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (10:19 IST)
Modi_Trump
భారత్-అమెరికా వాణిజ్య సుంకాల కారణంగా రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో ట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. 
 
తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నానని తెలిపారు. భారత్, యూఎస్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధినేతల స్వరాల్లో మార్పు చాలా కీలకంగా మారింది. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. 
 
ఇండియా, అమెరికాల మధ్య ఎటువంటి ఇబ్బంది ఉండదని.. భవిష్యత్తులో కూడా రాకుండా చూసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ప్రధాన మంత్రి మోదీతో వాణిజ్య చర్చలు జరుపుతానని చెప్తూనే..  వాణిజ్య చర్చలు జరుపుతానని మరోవైపు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు. 
 
భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ కొత్త ఎత్తుగడ వేశారు. 
 
భారత్‌తో పాటు చైనాపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసే వరకు ఈ రెండు దేశాలపై 100 శాతం సుంకాలు కొనసాగించాలని రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశంపై అమెరికా, ఈయూకు చెందిన సీనియర్ అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమైన భేటీలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments