Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వైమానిక దాడులు-కాబూల్ పేలుళ్ల సూత్రధారి హతం

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (08:42 IST)
ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. సామాన్య ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓవైపు తాలిబన్లతో భయం మరోవైపు ఆత్మాహుతి దాడులు.. వేరొక వైపు.. అమెరికా వైమానిక దాడులు.. మహిళలపై హింస అంటూ పలు అకృత్యాలు చోటుచేసుకోవడంతో సామాన్య ప్రజలకు కంటి మీద కించిత్ నిద్ర కరువైంది. 
 
తాజాగా అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగర హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రతీకారంగా అమెరికా మిలటరీ ఇస్లామిక్ స్టేట్ కీలక సభ్యుడిపై వైమానిక దాడి చేసింది. 
 
ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై అమెరికా వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. కాబూల్ పేలుళ్లు జరిగిన 48 గంటల తర్వాత నంగహర్‌లో ఇస్లామిక్ స్టేట్ అటాక్ ప్లానర్ పై దాడి చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ మిలటరీ శనివారం ఉదయం వెల్లడించింది. ఐసిస్-ఖోరాసన్ ఆత్మాహుతి దాడిలో 169 మంది అఫ్ఘాన్లు, 13మంది అమెరికన్ సేవా సభ్యులు మరణించారు.
 
కాబూల్ పేలుళ్ల సూత్రధారి అయిన నంగహర్ లోని కీలక ఐసిస్ ఖోరాసన్ సభ్యుడిపై అమెరికా సైనికులు జరిపిన వైమానిక దాడిలో అతను మరణించాడని అమెరికా తెలిపింది. ఈ వైమానిక దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేవీ కెప్టెన్ విలియం అర్బన్ పేర్కొన్నారు. వైమానిక దాడుల నేపథ్యంలో అమెరికన్ సైనికులు కాబూల్ విమానాశ్రయం గేట్లను వెంటనే వదిలి రావాలని పెంటగాన్ సూచించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments